Education6th Dec 11:31 AMSunil Byrisetty1 min read
ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ రాత పరీక్ష తేదీలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ రాత పరీక్ష తేదీలు తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేస
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ రాత పరీక్ష తేదీలు తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జామ్ ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించనుంది. ఈ మేరకు ఎగ్జామ్ షెడ్యుల్‌లో పేర్కొంది. ఈ రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో డిగ్రీ స్థాయిలో ఉంటుంది. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ రెండింటిలో ఒక్కో పేపర్ నుంచి మొత్తం 150 ప్రశ్నలకు, 150 మార్కులు, 150 నిమిషాలు చొప్పున మొత్తం 300 మార్కలకు పరీక్షలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున నెగెటివ్ మార్కుల కోత విధిస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిఫియెన్సీ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఏపీ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాత పరీక్ష తేదీ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే ఇక్కడ క్లిక్ చేయండి https://portal-psc.ap.gov.in/