News25th Aug 01:19 PMSunil Byrisetty1 min read

డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఏడాది కొనసాగింపు

రెవెన్యూ శాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో 175 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను(ఎన్నికలు) మరో సంవత్సరం పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పోస్టులు 2026 మార్చి 31 వరకు మాత

డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఏడాది కొనసాగింపు
రెవెన్యూ శాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో 175 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను(ఎన్నికలు) మరో సంవత్సరం పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పోస్టులు 2026 మార్చి 31 వరకు మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతాయి. వీరు ఎన్నికలకు సంబంధించిన ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఓటర్ జాబితాల నిరంతర నవీకరణ, కొత్త ఓటర్ ఐడీ కార్డుల జారీ, పేర్ల సవరణలు, చిరునామా మార్పులు ఇతర ఎలక్షన్ సంబంధిత పనులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం కొన్ని షరతులు పేర్కొంది. పోస్టులు పూర్తిగా తాత్కాలికం మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ పోస్టులకు ఎటువంటి పదోన్నతులు ఇవ్వకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Andhra Pradesh
Deputy Tahsildar
Revenue Department
Temporary Posts
Election Duties
Voter List Update
Voter ID Cards
Address Changes
Election Management
ప్రభుత్వ ఆదేశాలు
ఎన్నికల నిర్వహణ
ఏపీ ప్రభుత్వం
అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు
Scroll for the next article