News10th Oct 03:21 PMSunil Byrisetty1 min read

కల్తీ మద్యం ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఆదాయానికి గండి!

ఏపీలో కల్తీ మద్యం భయంతో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఎక్సైజ్ ఆదాయం భారీగా పడిపోయింది. రోజుకు సగటున రూ.78-80 కోట్లు వచ్చే రెవెన్యూ, కల్తీ భయంతో గణనీయంగా తగ్గింది. వినియోగదారుల

కల్తీ మద్యం ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఆదాయానికి గండి!
ఏపీలో కల్తీ మద్యం భయంతో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఎక్సైజ్ ఆదాయం భారీగా పడిపోయింది. రోజుకు సగటున రూ.78-80 కోట్లు వచ్చే రెవెన్యూ, కల్తీ భయంతో గణనీయంగా తగ్గింది. వినియోగదారులు మద్యం కొనుగోలుకు వెనుకాడటంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గింది. దీంతో ప్రభుత్వం ఆదాయ లోటుతో సతమతమవుతోంది. ఎక్సైజ్ శాఖ నకిలీ లిక్కర్ నెట్వర్క్‌ను గుర్తించేందుకు తనిఖీలు ముమ్మరం చేసింది. పలు ప్రాంతాల్లో నిందితులను గుర్తించి, ఐదుగురిని అరెస్టు చేసింది.
Andhra Pradesh
Fake Liquor
Excise Department
Government Revenue
Liquor Sales
Illegal Liquor
Excise Raids
Revenue Loss
Liquor Scam
Public Safety
Scroll for the next article