News8th Jul 05:27 PMSunil Byrisetty1 min read

ఉచిత బస్సు జిల్లా వరకే.. సీఎం చంద్రబాబు క్లారిటీ!

ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన ఉచిత బస్సు హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. మహిళలు జిల్లా వర

ఉచిత బస్సు జిల్లా వరకే.. సీఎం చంద్రబాబు క్లారిటీ!
ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన ఉచిత బస్సు హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. మహిళలు జిల్లా వరకు ఉచితంగా పర్యటించవచ్చని స్పష్టం చేశారు. శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. అయితే, దీనికి షరతులు వర్తిస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా తిరిగే అవకాశం ఉందని తేల్చి చెప్పారు.
Andhra Pradesh news
Srisailam
Chandra Babu
Ap free bus scheme
Women's
Ap limited to district
ఉచిత బస్సు జిల్లా వరకే
సీఎం చంద్రబాబు క్లారిటీ
Scroll for the next article