News19th Aug 09:45 AMSunil Byrisetty1 min read
ఉచిత బస్సులో ఒక్క రోజే 18 లక్షల ప్రయాణాలు
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందికి ప
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దీంతో వారికి రూ.7 కోట్లకు పైగా ఆదా అయ్యింది. పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా.. దాదాపు రూ.19 కోట్ల మేర వారికి ఆదా అయ్యింది. ఘాట్ రూట్‌లలోని ఆర్టీసీ సర్వీసుల్లో సైతం స్త్రీ శక్తి పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ప్రయాణించే మహిళల గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ జిరాక్సుతో పాటు మొబైల్ డిజిటల్ లాకర్లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని నిర్ణయించింది.