News5th Jun 05:29 PMSunil Byrisetty1 min read

అభివృద్దే ల‌క్ష్యంగా ప‌ని

ఏ ప‌ద‌వి చేప‌ట్టినా ఆ ప‌దవికే వ‌న్నె తెచ్చే నాయ‌కుడు, ఏ ప‌నిలోనైనా అభివృద్ది సాధించ‌ట‌మే లక్ష్యంగా ప‌నిచేసే బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు నెట్

అభివృద్దే ల‌క్ష్యంగా ప‌ని
ఏ ప‌ద‌వి చేప‌ట్టినా ఆ ప‌దవికే వ‌న్నె తెచ్చే నాయ‌కుడు, ఏ ప‌నిలోనైనా అభివృద్ది సాధించ‌ట‌మే లక్ష్యంగా ప‌నిచేసే బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు నెట్టెం ర‌ఘురామ్ అంటూ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ కొనియాడారు. బందరు రోడ్డులోని కె.డి.సి.సి.బి కార్యాల‌యంలో గురువారం కృష్ణ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా నెట్టెం ర‌ఘురామ్ పదవీ బాధ్యతలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ కె.డి.సి.సి.బి కార్యాల‌యంలో నెట్టెం ర‌ఘురామ్ ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపి శాలువాతో స‌త్క‌రించారు. చైర్మ‌న్ గా నెట్టెం నాయ‌క‌త్వంలో కె.డి.సి.సి.బి మ‌రింత వృద్దిలోకి రావాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు. నెట్టెంకు స్వ‌ఛ్చాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ కూడా శుభాకాంక్ష‌లు తెలిపి శాలువాతో స‌త్క‌రించారు.
Andhra Pradesh news
TDP
Vijayawada
Nettem Raghuram
అభివృద్దే లక్ష్యం
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
Scroll for the next article