News10th Aug 02:38 PMSunil Byrisetty1 min read

మహిళలను పారిశ్రమకవేత్తలుగా చేస్తాం

రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను పారిశ్రామికవేత్తగా చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని పట్టణ, పురపాలక శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మైపాడు

మహిళలను పారిశ్రమకవేత్తలుగా చేస్తాం
రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను పారిశ్రామికవేత్తగా చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని పట్టణ, పురపాలక శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మైపాడు గేట్ సెంటర్ వద్ద షాపులు పెట్టే మెప్మా మహిళలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం.. మహిళలకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో మోడల్గా మైపాడు గేట్ సెంటర్ వద్ద 240 షాపులు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కంటైనర్లు యుద్ధప్రాతిపదికన సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తొలి విడతలో 120 షాపులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి అన్నారు. మహిళలకు కార్పొరేషన్ మెప్మాల ద్వారా రెండు లక్షల రూపాయలు సబ్సిడీ అందుతుందని.. బ్యాంకు ద్వారా రెండు లక్షలు లోన్ మంజూరు అయిందన్నారు. అయితే వీరికి మంత్రి నారాయణ సొంత నిధులతో ఆర్థిక సహాయం లక్ష రూపాయలు సాయం చేస్తానని తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ షాపులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
Andhra Pradesh news
women empowerment
AP government schemes
Minister Ponguru Narayana
MAPMA women
smart street project
మహిళలకు ఆర్థిక సాయం
ఏపీ పట్టణాభివృద్ధి
మహిళల ఆర్థిక అభివృద్ధి
Scroll for the next article