News12th Nov 05:08 PMSunil Byrisetty1 min read
ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో తొంభై కోట్లు విడుదల చేస్తూ, ఇమామ్, మౌజన్ లకు నెలకు రూ.15,000 చొప్పున గౌరవ వేతనాలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం 2024 ఏప్రిల్, మే, జూన్ నెలలతోపాటు 2025 జనవరి నుండి సెప్టెంబర్ వరకు గౌరవ వేతనాలు మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో సద్భావన, ఆధ్యాత్మిక, విలువలను నిలబెట్టడానికి కృషి చేస్తున్న రాష్ట్రంలోని వేలాది ఇమామ్‌లు, మౌజన్ లకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే చర్యగా ఆయన అభివర్ణించారు. మైనార్టీలపై చిత్తశుద్ధి చూపిన చంద్రబాబు నాయుడుకు ముస్లిం సమాజం కృతజ్ఞతలు తెలియజేస్తుందని అన్నారు. అలాగే, ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ప్రతి అర్హుడి చేతికి సకాలంలో చేరేలా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.