News24th Jul 04:25 PMSunil Byrisetty1 min read
కేంద్రం, రాష్ట్రాల 50:50 భాగస్వామ్యంతో మెట్రో
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కేంద్రం, రాష్ట్రాలు 50:50 భాగస్వామ్యంతో నిర్మించనున్నాయి. విశాఖ మెట్రోకు రాష
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కేంద్రం, రాష్ట్రాలు 50:50 భాగస్వామ్యంతో నిర్మించనున్నాయి.
విశాఖ మెట్రోకు రాష్ర్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. విశాఖ మెట్రోకు వీఎంఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు ప్రభుత్వం రేపు టెండర్లు పిలవనుంది. రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. రూ.10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలుకు, రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లు ఆహ్వానించనున్నారు.