Politics15th Oct 05:51 PMSunil Byrisetty1 min read

జగన్ కేసుల్లో ఈడీ ఎంట్రీకి అనుమతి

వాన్ పిక్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులో నిందితుడిగా ఉన్న ఐఏఎస్ బ్రహ్మానందరెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. వాన్‌పిక్ కేసులో అప్ప

జగన్ కేసుల్లో ఈడీ ఎంట్రీకి అనుమతి
వాన్ పిక్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులో నిందితుడిగా ఉన్న ఐఏఎస్ బ్రహ్మానందరెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. వాన్‌పిక్ కేసులో అప్పటి ప్రత్యేక కార్యదర్శి కేవీ బ్రహ్మానందరెడ్డిపై మనీలాండరింగ్ కేసులో ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 221 ఇచ్చింది. వాన్ పిక్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఐఏఎస్ బ్రహ్మానందరెడ్డిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఈ అనుమతి ఇచ్చింది. వాన్‌పిక్ గ్రూప్ కంపెనీలకు అనుచిత ప్రయోజనాలు కల్పించారంటూ బ్రహ్మానందరెడ్డిపై ఈడీ ఆరోపణలు చేస్తోంది. అప్పటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన బ్రహ్మానందరెడ్డి.. వైఎస్ జగన్, ఇతరులతో కలిసి కుట్రకు పాల్పడి వాన్‌పిక్ కంపెనీలకు ప్రయోజనాలు కల్పించారనేది ఈడీ అభియోగం. దీంతో స్థానిక ఎన్నికల వేళ వైసీపీపై ఒత్తిడి పెరుగుతోంది.
Scroll for the next article