Entertainment10th Jan 01:04 PMSunil Byrisetty1 min read

మన శంకర వరప్రసాద్' టికెట్ రేట్ల పెంపు

చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, సినిమా వి

మన శంకర వరప్రసాద్' టికెట్ రేట్ల పెంపు
చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, సినిమా విడుదలయ్యే జనవరి 12కు ముందు రోజు, అంటే జనవరి 11 ఆదివారం రాత్రి ప్రదర్శించే పెయిడ్ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 500 వరకు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు. ఇక విడుదలైన మొదటి 10 రోజుల పాటు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్లలో రూ. 100 (జీఎస్టీతో కలిపి మొత్తం టికెట్ ధర రూ. 247), మల్టీప్లెక్స్‌లలో రూ. 125 (జీఎస్టీతో కలిపి మొత్తం టికెట్ ధర రూ. 302) పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇదే కాలంలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.
Film News
Chiranjeevi
Mana Shankara Varaprasad Garu
AP Government
Movie Ticket Prices
Telugu Cinema
Paid Premier Shows
Single Screens
Multiplexes
Scroll for the next article