News11th Jul 05:04 PMSunil Byrisetty1 min read
పుష్కరాలపై ఫోకస్.. ఏడాది ముందే వ్యూహం
2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకోసం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మంత్రులు డా. పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్ రా
2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకోసం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మంత్రులు డా. పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో విస్తృతంగా పర్యటించారు. పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనకు ముందు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాల మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధుల కేటాయింపు, శాఖల సమన్వయంపై విస్తృతంగా చర్చించారు.