News21st Jul 04:27 PMSunil Byrisetty1 min read
రామాయపట్నం పోర్టుపై వైసీపీ మైండ్ గేమ్ అట్టర్ ఫ్లాప్
రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం అమ్మేస్తోందంటూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. కేవలం రాజకీయాల కోసమే వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్త
రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం అమ్మేస్తోందంటూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. కేవలం రాజకీయాల కోసమే వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మరోసారి తేటతెల్లమయింది. పోర్టును ప్రైవేటీకరించడం లేదని, కేవలం నిర్వహణ బాధ్యతలను మాత్రమే పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ - PPP పద్ధతిలో గ్లోబల్ టెండర్ల ద్వారా అవుట్‌సోర్స్ చేస్తున్నారనే నిజాన్ని వైసీపీ దాస్తోంది. ఈ PPP మోడల్ వల్ల ప్రభుత్వానికి ₹1,500 కోట్ల ముందస్తు ప్రీమియంతో పాటు, పోర్టు ఆదాయంలో మేజరు వాటా, 12 శాతం ఈక్విటీ లభిస్తాయి. పైగా రాబోయే రోజుల్లో పోర్టు విస్తరణకు కావాల్సిన ₹16,000 కోట్ల భారీ పెట్టుబడిని కూడా ప్రైవేట్ భాగస్వామే భరించాల్సి ఉంటుంది. కేవలం ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ నిర్వహించే విధానాన్ని అమ్మేయడం అని ప్రచారం చేయడం ఫ్యామ్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతోంది. జగన్ హయాంలో ఈ పోర్టు పనులు సగం కూడా పూర్తికాకుండా, వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి ప్రాజెక్టును పడకేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసింది. ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందోననే భయంతో వైసీపీ తప్పుడు కథనాలను అల్లుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.