News29th Apr 04:08 PMSunil Byrisetty1 min read
ప్రాజెక్టులు వస్తున్నాయి.. అండగా నిలవాలి
రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఓవైపు స్వర్ణాంధ్ర-20
రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఓవైపు స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు అనుగుణంగా పనిచేస్తూనే... మరోవైపు 2029 కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతివ్వాలని, 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని కోరారు.
మంగళవారం సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు సూచించారు.
2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి, 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు.
నూరు శాతం లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లను అభినందించారు.
సమావేశంలో 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ‘ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్’ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు.