News11th Jul 04:23 PMSunil Byrisetty1 min read

ఉద్యోగుల సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ కర్తవ్యం

రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని మంత్రులు కొలుసు పార్ధసారధి,అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.సచివాలయంలో ఎపి జెఎసి అమరావతి ఉద్యోగ సంఘాల

ఉద్యోగుల సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ కర్తవ్యం
రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని మంత్రులు కొలుసు పార్ధసారధి,అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.సచివాలయంలో ఎపి జెఎసి అమరావతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రాధమికంగా చర్చించారు.గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా సమస్యలను ప్రక్కన పెట్టడంతో ఈసమస్య వచ్చిందని పేర్కొన్నారు.ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మొత్తం 23 డిమాండ్లను ఇవ్వడం జరిగిందని వాటన్నింటినీ పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి పూర్తి సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Kolusu Parthasarathy
Anagani Satya Prasad
AP JAC Amaravati
Government Employees
Employee Associations
Secretariat
సచివాలయం
ఉద్యోగుల సంక్షేమం
ఏపీ ప్రభుత్వం
పరిపాలన
Scroll for the next article