Education30th Jul 05:33 PMSunil Byrisetty1 min read
ఉపాధ్యాయ అవార్డుల కోసం కమిటీ
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం ఏపీ ప్రభుత్వం కమిటీ వేసింది. 2026 సంవత్సరానికి ప్రదానం చేయనున్న "రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు" ఎంపిక కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉ
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం ఏపీ ప్రభుత్వం కమిటీ వేసింది. 2026 సంవత్సరానికి ప్రదానం చేయనున్న "రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు" ఎంపిక కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీలో:
▪️మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి – ఛైర్మన్.
▪️పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి – వైస్ ఛైర్మన్.
▪️పాఠశాల విద్యా సంచాలకులు – కన్వీనర్.
▪️ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ – సభ్యులు.
▪️శ్రీ రాము సూర్యారావు (RSR మాస్టర్) – సభ్యులు.
ఈ కమిటీ 2026 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, ప్రభుత్వం నిర్దేశించిన కోటా మేరకు అవార్డు గ్రహీతలను ఖరారు చేయనుంది.