News10th Sep 11:20 AMSunil Byrisetty1 min read

సీఎం వ్యాఖ్యలపై ఫేక్ ప్రచారం.. సీరియస్!

ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. పురుగు మందులు, యూరియా వినియోగం తగ్గ

సీఎం వ్యాఖ్యలపై ఫేక్ ప్రచారం.. సీరియస్!
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. పురుగు మందులు, యూరియా వినియోగం తగ్గించాలంటూ సీఎం ఫేక్ వీడియో ప్రచారంలోకి తెచ్చారు. రైతులకు సీఎం సూచనలపై సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారం చేశారు. చంద్రబాబు మాట్లాడినట్లు ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవాలు ధృవీకరించకుండానే ఏ సమాచారం నమ్మొద్దని సూచించింది. తప్పుడు ప్రచారాలను అరికట్టడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సైబర్ క్రైమ్ ఐజీ కోరారు.
Andhra Pradesh
Fake News
Social Media
Chandrababu Naidu
AP Government
Cyber Crime
CID Investigation
AI Deepfake
Misinformation
తప్పుదారి సమాచారాలు
ఫేక్ వీడియో హెచ్చరిక
Scroll for the next article