News27th Apr 11:21 AMSunil Byrisetty1 min read

బార్‌ లైసెన్సింగ్‌ ఫీజులు మార్పులు

రాష్ట్ర వ్యాప్తంగా 3 స్టార్‌, అంతకు మించిన హోటళ్లలో- మద్యం విక్రయాలకు సంబంధించి బార్‌ లైసెన్సింగ్‌ ఫీజులు మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం జీవో 131 జారీ చేసింది. 3-స్టార్ సహా ఆ పై స్థ

బార్‌ లైసెన్సింగ్‌ ఫీజులు మార్పులు
రాష్ట్ర వ్యాప్తంగా 3 స్టార్‌, అంతకు మించిన హోటళ్లలో- మద్యం విక్రయాలకు సంబంధించి బార్‌ లైసెన్సింగ్‌ ఫీజులు మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం జీవో 131 జారీ చేసింది. 3-స్టార్ సహా ఆ పై స్థాయి హోటళ్లలో బార్ల లైసెన్సు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని తగ్గించడం ద్వారా ఆతిధ్య రంగానికి ఊతమిచ్చే నిర్ణయం తీసుకుంది. లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల రంగానికి ఎంతే మేలు చేసినట్టు అవుతుంది. తద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది. పర్యాటకంతో పాటు ఆతిథ్యరంగాల పురోభివృద్ధికి బార్ల రిజిస్ట్రేషన్ ఛార్జి, లైసెన్సు ఫీజులను తగ్గిస్తూ ఆదేశాలు దోహదపడతాయి. ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.5 లక్షల మేర , నాన్ రిఫండబుల్ ఛార్జీ రూ. 20 లక్షల మేర నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Ap Government
Reduce Bar License Fees
Non Refundable Registration Charges
బార్‌ లైసెన్సింగ్‌ ఫీజులు మార్పులు
ప్రభుత్వం జీవో 131 జారీ
Scroll for the next article