Education29th Jul 05:04 PMSunil Byrisetty1 min read

మైనారిటీలకు విద్య, ఉద్యోగావకాశాలు

మైనారిటీ యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చి వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైనారిటీ శాఖ మం

మైనారిటీలకు విద్య, ఉద్యోగావకాశాలు
మైనారిటీ యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చి వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మైనారిటీ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమనే సంకల్పంతో ప్రభుత్వం మైనారిటీల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరం వద్ద మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సీఈడీఎం) నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. సీఈడీఎం ద్వారా మైనారిటీ యువత కోసం ఉచిత కోచింగ్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన అధ్యాపకులతో ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌తో పాటు ఆఫ్‌లైన్ తరగతులను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.
Andhra Pradesh
Minority Welfare
NMD Farooq
CEDM
Centre for Educational Development of Minorities
Minority Students
ఆన్‌లైన్ కోచింగ్
ఆఫ్‌లైన్ తరగతులు
మంగళగిరి
వడ్డేశ్వరం
Scroll for the next article