Education29th Nov 04:11 PMSunil Byrisetty1 min read
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, స్టడీ సర్కిల్ విజయవాడ వారి ఆదేశముల మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులను స్వీకరించుటకు గడువును పొడిగ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, స్టడీ సర్కిల్ విజయవాడ వారి ఆదేశముల మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులను స్వీకరించుటకు గడువును పొడిగిస్తున్నట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సంచాలకులు తెలిపారు. అర్హత కలిగిన బి.సి., ఎస్.సి., ఎస్.టి. విద్యార్ధులు దరఖాస్తును డిసెంబర్ 3వ తేదీలోపు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సాధికారత అధికారి, విజయవాడ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. డిసెంబర్ 7న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సాధికారత అధికారి కే లక్ష్మి దేవి పేర్కొన్నారు. వివరాల కోసం విజయవాడలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సాధికారత అధికారి కార్యాలయం, 74-2-1/5, అశోక్ నగర్ డోర్ నెంబర్ :74-2-1/5, పండరిపురం, రోడ్డు నెం 8, విజయవాడ-520007లో సంప్రదించాలని కోరారు. ఫోన్ నెంబర్.: 9966849937, 9505094349, 8688855255 చేసి అదనపు వివరాలు తెలుసుకోవచ్చన్నారు.