News7th Jul 12:51 PMSunil Byrisetty1 min read
మరో 70 అన్న క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకూ అన్న క్యాంటీన్‌లు విస్తరించనున్నాయి. ఈ 70 కొత్త క్యాంటీన్ల భవనాల నిర్మాణ పనులు సైతం ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. డిసెంబరు నాటికి వీటి
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకూ అన్న క్యాంటీన్‌లు విస్తరించనున్నాయి. ఈ 70 కొత్త క్యాంటీన్ల భవనాల నిర్మాణ పనులు సైతం ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. డిసెంబరు నాటికి వీటిని సిద్ధం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న 204 క్యాంటీన్లలో రోజూ మూడు పూటలా మొత్తం 1,84,500 మంది ఆహారం తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిపై మూడు పూటలా కలిపి రాయితీ కింద సుమారు రూ.75 ఖర్చు చేస్తోంది. అల్పాహారంపై రూ.17, మధ్యాహ్నం భోజనంపై రూ.29, రాత్రి భోజనంపై మరో రూ.29 చొప్పున ప్రభుత్వం భరిస్తోందని అధికారులు చెబుతున్నారు. జిల్లా వారీగా కొత్తగా మంజూరు చేసిన అన్న క్యాంటీన్లు
శ్రీకాకుళం: 5, పార్వతీపురం మన్యం: 1, విజయనగరం: 3, అల్లూరి సీతారామరాజు: 3, అనకాపల్లి: 3, అంబేడ్కర్ కోనసీమ: 3, తూర్పు గోదావరి: 4, పశ్చిమ గోదావరి: 3, కాకినాడ: 2, ఏలూరు: 4, గుంటూరు: 5, పల్నాడు: 1, ఎన్టీఆర్: 1, కృష్ణా: 3, ప్రకాశం: 4, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: 3, తిరుపతి: 2, చిత్తూరు: 7, అనంతపురం: 3, శ్రీ సత్యసాయి: 1, కర్నూలు: 4, నంద్యాల: 1, వైఎస్ఆర్ కడప: 1, అన్నమయ్య: 3