News20th Jul 04:52 PMSunil Byrisetty1 min read
యువతకు టూరిజం గైడ్స్‌గా ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని జైపూర్‌లో పర్యటిస్తున్న మంత్రి.. టూరిస్ట్
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని జైపూర్‌లో పర్యటిస్తున్న మంత్రి.. టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ నరేంద్ర సింగ్ రాథోర్ ను కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనపై చర్చించారు. పర్యాటక రంగంలోని 20 కీలక విభాగాలలో 10,000 మంది యువతకు టూరిజం అండ్ హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించిన అంశాన్ని గుర్తుచేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆల్ ఇండియా టూరిజం గైడ్స్ ఫెడరేషన్ సహకారంతో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి వారిని ప్రొఫెషనల్ టూర్ గైడ్స్‌గా తీర్చిదిద్దాలని మంత్రి దుర్గేష్ ఆయనను కోరారు. తద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పర్యాటక సేవలను మెరుగుపరచడంతో పాటు, పర్యాటక రంగంలో యువతను తీర్చిదిద్దడం, వారికి శిక్షణను అందించేందుకు ఏపీలో పర్యటించాలని ఫెడరేషన్ ప్రతినిధులను మంత్రి దుర్గేష్ ఆహ్వానించారు.