News25th Jun 12:16 PMSunil Byrisetty1 min read
అంగన్వాడీలకు అదిరిపోయే న్యూస్.. నెలకు రూ.11,500
ఏపీలో మినీ అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాటిని ప్రధాన అంగన్వాడీలుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాన అంగన్వాడీలకు రూ.11,500 గౌరవ వేతనం అందించనుంది. ప్రస్త
ఏపీలో మినీ అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాటిని ప్రధాన అంగన్వాడీలుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాన అంగన్వాడీలకు రూ.11,500 గౌరవ వేతనం అందించనుంది. ప్రస్తుతం మినీ అంగన్వాడీలకు రూ.7 వేలు వేతనం అందుతోంది. కాగా, కొత్తగా 4,687 మంది సహాయకులను నెలకు రూ.7,000 జీతం చెల్లించి నియమించనుంది. ఇందుకోసం ప్రభుత్వానికి రూ.64.67 కోట్ల ఖర్చు కానుంది.