News30th Apr 11:10 AMSunil Byrisetty1 min read

కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ

కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలం ముగిసిపోగా వారి సేవలను 2026 ఏడాది మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే సేవల పొడిగింపు వర్తిస్తుందని ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయుష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Ap government
contract employees contract extension
నారా చంద్రబాబు నాయుడు
కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం
2026 ఏడాది మార్చి 30వ తేదీ వరకు
Scroll for the next article