News26th Aug 05:02 PMSunil Byrisetty1 min read
కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్
ఏపీలో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సెప్టెంబర్ 2వ వారం నుండి దరఖాస్తుల స్వీకరణకు అవకాశాలున్నాయి. గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్
ఏపీలో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సెప్టెంబర్ 2వ వారం నుండి దరఖాస్తుల స్వీకరణకు అవకాశాలున్నాయి. గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలకు త్వరలో లాగిన్ ఇవ్వనున్నారు. దరఖాస్తుల ఆన్ లైన్ విధానంపై వారం రోజులుగా సెర్ప్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ పెన్షన్లలో వితంతువులు, వృద్ధులకు మొదటి ప్రాధాన్యత కల్పించనున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 1.5లక్షల వితంతు పింఛన్ కు, 1.5లక్షలు వృద్ధాప్య పింఛనుకు అర్హులుగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అంగ వైకల్యం కోసం సదరం సర్టిఫికెట్ తో పాటు ఇతర అర్హతల నిర్ధారణపై ఇంకా కసరత్తు జరుగుతోంది. వృత్తి పరమైన పింఛన్లకు సుమారు 60 నుంచి 70 వేల అర్హులుగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ప్రాతిపదికన సెప్టెంబర్లో దరఖాస్తులు స్వీకరించి, అక్టోబర్ నెలలో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.