News21st Apr 10:28 AMSunil Byrisetty1 min read
రైతులకు పండుగే.. ఉచిత విద్యుత్ కనెక్షన్లకు ఓకే!
రైతుల సుదీర్ఘ డిమాండ్ అయిన ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు 50 వేల ఉచిత విద్
రైతుల సుదీర్ఘ డిమాండ్ అయిన ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు 50 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కనెక్షన్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిస్కంలను ఆదేశించింది.
ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ. 450 కోట్లు ఖర్చు చేయనుంది.
గత ప్రభుత్వంలో పెండింగ్ దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా కొత్త కనెక్షన్లు జారీ చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వంపై భారమైనప్పటికీ రైతుల కోసం భరించాలని భావిస్తోంది.