Crime9th Mar 06:01 PMSunil Byrisetty1 min read

వివేకా కేసులో ప్రభుత్వం సీరియస్.. సిట్ ఏర్పాటు!

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వరుసగా సాక్షులు చనిపోవడంపై యాక్షన్ లోకి దిగింది. వివేకానంద రెడ్డి ఇంటి వాచ్ మన్ రంగన్న మర

వివేకా కేసులో ప్రభుత్వం సీరియస్.. సిట్ ఏర్పాటు!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వరుసగా సాక్షులు చనిపోవడంపై యాక్షన్ లోకి దిగింది. వివేకానంద రెడ్డి ఇంటి వాచ్ మన్ రంగన్న మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో రీ పోస్టు మార్టంకు ఆదేశించింది. నివేదికలో అనుమానాస్పద విషయాలు వెల్లడవడంతో సిట్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పదహారు మందితో కూడిన సిట్ సీనియర్ డీఎస్పీ నేతృత్వంలో విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకూ వివేకా హత్య కేసులో కీలకమైన సాక్షులు ఆరుగురు చనిపోయారు. హఠాత్తుగా అానారోగ్యం పాలై చనిపోతున్నారు. ఈ మరణాల వెనుక కారణాలేంటో సిట్ బయట పెట్టనుంది.
Viveka Murder Case
YS Viveka Case
Witness Deaths
SIT In Viveka Case
వివేకా హత్య కేసు
వైఎస్ వివేకా కేసు
సాక్షుల మరణాలు
వివేకా కేసులో సిట్
Scroll for the next article