News14th Jul 05:08 PMSunil Byrisetty1 min read
డేగ కన్నుతో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో డేగ కన్నుతో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపి మంచి ఫలితాలను సాధించడం జరిగిందని రాష్ట్ర హోం, డిజాస్టర్ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రభుత
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో డేగ కన్నుతో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపి మంచి ఫలితాలను సాధించడం జరిగిందని రాష్ట్ర హోం, డిజాస్టర్ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రభుత్వం, హోం శాఖ, ఈగల్ టీమ్ సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. సచివాలయంలో ఆమె మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు విద్య, వైద్య, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, హోం శాఖల మంత్రులతో ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ నేతృత్వంలో అమరావతి హెడ్ క్వార్టర్ తో పాటు రాజమహేంద్రవరం మరియు విశాఖపట్నం కేంద్రాలుగా ఈగల్ టాస్కు ఫోర్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 26 జిల్లాల్లో ఈగల్ సెల్స్ ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ నియంత్రణకై పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఏడాది కాలంలో 831 కేసులను బుక్ చేసి 2,114 మందిని అరెస్టు చేయడమే కాకుండా 23,770 కేజీల గంజాయిని, 27 లీటర్ల హాషిష్ ఆయిల్‌ను సీజ్ చేయడం జరిగిందన్నారు. గంజాయి సాగును ప్రోత్సహించే కింగ్ పిన్స్ కి చెందిన రూ.7.75 కోట్ల ఆస్తులను కూడా సీజ్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు.