News4th Jun 01:27 PMSunil Byrisetty1 min read
ఉపాధి కార్మికులకు గుడ్ న్యూస్!
ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండ్రోజుల్లో వారి అకౌంట్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఇప్పటికే ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించి వేతనాలను కేంద్ర ప్రభ
ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండ్రోజుల్లో వారి అకౌంట్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఇప్పటికే ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించి వేతనాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మే నెల శ్రామికుల వేతనాలు నిలిచిపోగా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి రూ.1,000 కోట్లు విడుదల అయ్యాయి. ఈ డబ్బులు శ్రామికుల అకౌంట్లో రెండు, మూడు రోజుల్లో జమ కానున్నాయి. మరోవైపు, కేంద్ర నుంచి ఇంకా రూ.1,100కోట్ల వేతన బకాయిలు, రూ.2,500 కోట్లు మెటీరియల్ నిధులు రావాల్సి ఉంది.