News28th Apr 04:31 PMSunil Byrisetty1 min read
డ్వాక్రా మహిళలకు శుభవార్త!
స్వయం సహాయక సంఘాలకు సూపర్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. వచ్చే ఏడాది మార్చిలోపు 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.61,964 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే వారికి పలు రంగా
స్వయం సహాయక సంఘాలకు సూపర్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.
వచ్చే ఏడాది మార్చిలోపు 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.61,964 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది.
అలాగే వారికి పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనుంది. కాగా, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంపద తదితర రంగాల్లో మహిళలకు రుణాలు ఇవ్వనుంది.
మినీ రైస్ మిల్స్, డ్రోన్ల వినియోగం, తృణధాన్యాల సాగు, సేంద్రీయ వ్యవసాయంపై మహిళలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది.
డ్వాక్రా మహిళలు సొంతకాళ్లపై నిలబడేందుకు అన్ని రకాలుగా సాయం చేయనుంది.