News22nd Apr 10:46 AMSunil Byrisetty1 min read

పింఛను తీసుకోలేదా.. మెసేజ్ అలర్ట్!

రాష్ట్రంలో పింఛన్ పంపిణీదారులకు జవాబుదారీగా ఉండేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోయినా.. ఏదైన

పింఛను తీసుకోలేదా.. మెసేజ్ అలర్ట్!
రాష్ట్రంలో పింఛన్ పంపిణీదారులకు జవాబుదారీగా ఉండేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోయినా.. ఏదైనా కారణం వల్ల ఆ నెల పింఛను తీసుకోకపోయినా మెసేజ్ అలర్ట్ పంపాలని నిర్ణయించింది. పింఛన్ అందని లేదా పొందని లబ్ధిదారుల సెల్ ఫోన్‌కు సమాచారం అందించాలని సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. ఇందుకుగాను లబ్దిదారు లేదా వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ సేకరించనున్నారు. ప్రతి నెలా 1, 2 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయిస్తోంది. ఈ క్రమంలో పింఛన్ విషయంలో ఆందోళన చెందకుండా మెసేజ్ పంపనుంది.
Andhra Pradesh
key decision on pensions
పింఛన్ పంపిణీదారులకు జవాబుదారీ
మెసేజ్ అలర్ట్
ప్రభుత్వం కొత్త ఆలోచన
Scroll for the next article