News21st Jul 04:45 PMSunil Byrisetty1 min read

పురపాలక ఔట్‌సోర్సింగ్‌ వర్కర్ల వేతనం పెంపు

పురపాలక శాఖ పరిధిలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్నఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌ పీహెచ్‌ వర్కర్ల వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్ర

పురపాలక ఔట్‌సోర్సింగ్‌ వర్కర్ల వేతనం పెంపు
పురపాలక శాఖ పరిధిలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్నఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌ పీహెచ్‌ వర్కర్ల వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. కేటగిరీ-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి 24,500కు పెంచింది. కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500 పెంచుతున్నట్లు ప్రకటించింది. కేటగిరీ-3 వర్కర్ల వేతనం రూ.15 వేల నుంచి రూ.18,500కు పెంచింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP Government
Salary Hike
Outsourcing Workers
Municipal Department
Category Workers
Urban Development
Employee Welfare
Wage Revision
పురపాలక ఔట్‌సోర్సింగ్‌ వర్కర్ల వేతనం పెంపు
Scroll for the next article