News1st Jan 10:49 AMSunil Byrisetty1 min read
ట్రైనీ కానిస్టేబుళ్లకు స్టైపెండ్ పెంపు
ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు నూతన సంవత్సరం సందర్భంగా కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ప్రతి నెలా చెల్లించే స్టైపెండ్ను రూ. 4,500 న
ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు నూతన సంవత్సరం సందర్భంగా కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ప్రతి నెలా చెల్లించే స్టైపెండ్ను రూ. 4,500 నుంచి రూ.12 వేలకు పెంచింది. అంటే ఒక్క సారిగా రూ.7,500 పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో చివరిసారిగా శిక్షణ కానిస్టేబుళ్లకు స్టైపెండ్ పెంచారు. ఆ తర్వాత గత 13 ఏళ్లుగా మార్పు లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6014 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేశారు. డిసెంబరు 16న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారికి నియామక పత్రాలు అందించి శిక్షణకు పంపారు. ఆ సందర్భంగా స్టైపెండ్ను రూ.12 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.