Education2nd Jun 10:20 AMSunil Byrisetty1 min read
ఉద్యోగుల బదిలీపై కీలక నిర్ణయం
ఆంద్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈ నెల జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలన
ఆంద్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈ నెల జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రం లో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల బదిలీల్లో అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. మరో తొమ్మిది రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును పెంచాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు.