News15th May 12:42 PMSunil Byrisetty1 min read
చెరువుల మట్టి పొలాలకు.. ప్రభుత్వం ఆదేశాలు!
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. చెరువులు, జలాశయాల నుంచి పూడిక మట్టిని తరలించుకునేందుకు అవకాశం ఇచ్చింది. సొంత అవసరాలకు.. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరులు మరమ్మతులకు సం
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
చెరువులు, జలాశయాల నుంచి పూడిక మట్టిని తరలించుకునేందుకు అవకాశం ఇచ్చింది.
సొంత అవసరాలకు.. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరులు మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది.
చెరువులతో పాటు కాలువల్లో మట్టి, పూడిక తీయాలని నిర్ణయించింది.
అయితే ఆ మట్టిని రైతులు తమ సొంత పొలాలకు తరలించేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
రైతులు సొంత ఖర్చుతో కూడిక తీసుకుని ఆ మట్టిని వినియోగించుకోవచ్చు.
దీనికి సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి అనుమతులు తీసుకోవాలి.
చెరువులు, జలవనరుల గట్లపై ఈ పూడిక తీసిన మట్టిని నిల్వ చేయకూడదు.
ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.