Farmers28th Jul 10:28 AMSunil Byrisetty1 min read
త్వరలో వ్యవసాయ యంత్ర సర్వే
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వ్యవసాయ యంత్రాల సమగ్ర సర్వేను త్వరలో ప్రారంభించి ఈ నెల ఆగస్టు 31వ తేదీలోపు పూర్తిచేయాల్సిందిగా వ్యవసాయ అధికారులను ఆదేశించినట్లు వ్
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వ్యవసాయ యంత్రాల సమగ్ర సర్వేను త్వరలో ప్రారంభించి ఈ నెల ఆగస్టు 31వ తేదీలోపు పూర్తిచేయాల్సిందిగా వ్యవసాయ అధికారులను ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు తెలిపారు.
ఈ సర్వేను రైతు సేవా కేంద్రాల (RSKs) వ్యవసాయ సహాయకులు నిర్వహించనున్నారు. ఇది రైతులు, సంస్థలు, FPOలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), ప్రైవేట్ సంస్థల వద్ద ఉన్న యంత్రాలను – అవి రాయితీపై లేదా స్వయంగా కొనుగోలు చేసినదే అయినా సర్వే చేయడం జరుగుతున్నదని తెలిపారు.
ఈ సర్వేలో యంత్రాల యజమాన్యం, వినియోగం,వాటి వాడకపు పరిస్థితి వంటి వివరాలు సేకరించబడతాయి. ఇవి వాస్సర్ లాబ్స్ రూపొందించిన ఎపిఎయిమ్స్ 2.0 వెర్షన్ లోని వ్యవసాయ సమాచార యాజమాన్య వ్యవస్థ (FMIS) లోకి డిజిటల్ రూపంలో అనుసంధానించబడతాయి.