News10th Jul 10:39 AMSunil Byrisetty1 min read

పెండింగ్లో ఉంటే చెక్ స్లిప్ ఇవ్వాల్సిందే!

దస్తావేజుల పెండింగ్ పై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏదైనా దస్తావేజును పెండింగ్లో ఉంచితే లిఖితపూర్వక చెక్ స్లిప్ జారీ చేయాలని స్పష్టం చేసింది. చ

పెండింగ్లో ఉంటే చెక్ స్లిప్ ఇవ్వాల్సిందే!
దస్తావేజుల పెండింగ్ పై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏదైనా దస్తావేజును పెండింగ్లో ఉంచితే లిఖితపూర్వక చెక్ స్లిప్ జారీ చేయాలని స్పష్టం చేసింది. చెక్ స్లిప్ ఇవ్వకపోయినా, ఏదైనా దస్తావేజును కార్డ్ 2.0లో నమోదు చేయకుండా అనధికారికంగా పెండింగ్లో ఉంచినా.. తీవ్రమైన సేవాలోపంగా పరిగణిస్తామంటూ సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద సంఖ్యలో దస్తావేజుల్ని చాలాకాలం పెండింగ్లో ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో కాలపరిమితితో కూడిన విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. దీన్ని పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
Andhra Pradesh
Property Registration
Sub Registrar Office
Check Slip
Revenue Department
Registration Department
సాయిప్రసాద్
ఏపీ ప్రభుత్వం
కార్డ్ 2.0
భూ రిజిస్ట్రేషన్
పరిపాలనా సంస్కరణలు
Scroll for the next article