News5th Aug 05:29 PMSunil Byrisetty1 min read

‘చట్టం’తో బీసీలకు రక్షణ

బీసీ రక్షణ చట్టంతో వెనుబడిన వర్గాలు గౌరవ ప్రదంగా సామాజిక జీవనం కొనసాగించేలా రక్షణ కల్పిస్తున్నామని, కులం, వృత్తుల పేరుతో దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం రూపొందిస్తున్నామని మంత్ర

‘చట్టం’తో బీసీలకు రక్షణ
బీసీ రక్షణ చట్టంతో వెనుబడిన వర్గాలు గౌరవ ప్రదంగా సామాజిక జీవనం కొనసాగించేలా రక్షణ కల్పిస్తున్నామని, కులం, వృత్తుల పేరుతో దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం రూపొందిస్తున్నామని మంత్రులు ఎస్.సవిత, అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ చట్టంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలు తీసుకున్నామని, త్వరలో జిల్లా స్థాయిలోనూ బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు. బీసీ ముసాయిదా రక్షణ చట్టం జాతీయ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని, అక్కడ అనుమతి రాగానే అసెంబ్లీలో ఆమోదానికి ప్రవేశపెడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా బీసీ రక్షణ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బీసీ రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తోందన్నారు.
Andhra Pradesh
BC Protection Law
Backward Classes
S Savitha
Atchannaidu
బీసీ సంక్షేమం
చట్టం
జాతీయ బీసీ కమిషన్
సామాజిక న్యాయం
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article