News19th Sep 05:04 PMSunil Byrisetty1 min read
50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు
50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేయడమే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎటువంటి అక్రమాలు, అవినీతి తావులేకుండా అర్హులైన
50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేయడమే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎటువంటి అక్రమాలు, అవినీతి తావులేకుండా అర్హులైన నేతన్నలందరికీ పెన్షన్లు అందజేసేలా దరఖాస్తులు స్వీకరిస్తోంది. నేతన్నల దరఖాస్తుల పరిశీలనలో జరుగుతున్న చేతివాటంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలకు ఆర్థిక మేలు కలుగజేయాలన్న లక్ష్యాన్ని నీరు గార్చుతున్న అధికారులపై కొరడా ఝుళిపించారు. దరఖాస్తుల పరిశీలన పేరుతో పచ్చ నోట్లకు కక్కుర్తిపడిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయించారు. అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, నేతన్నల సేవలో పథకంపై అమలు తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. నూతన పెన్షన్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి...వాటి పరిశీలన గురించి ఆరా తీశారు. నూతన పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16,521 దరఖాస్తులు వచ్చినట్లు ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటింటికీ వెళ్లి అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84 వేలకుపైగా చేనేతలకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు.