News28th Nov 12:36 PMSunil Byrisetty1 min read
'దిత్వా' తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
'దిత్వా' తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోం మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశ
'దిత్వా' తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోం మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండాలని, ఎక్కడా ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, కనుక ప్రమాదకరమైన హోర్డింగ్స్ వెంటనే తొలగించాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండేవారిని గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. SDRF, NDRF బృందాలు ఆ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు.