News17th Jun 04:10 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో 3 ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’

రాష్ట్రంలో వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా... రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించార

రాష్ట్రంలో 3 ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’
రాష్ట్రంలో వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా... రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మొదటగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని, అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాలను వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలిగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. మంగళవారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వ్యర్ధాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. మొదటిదశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ‘సర్క్యులర్ ఎకానమీ పార్కు’ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లోని పార్కులను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
Andhra Pradesh news
cm chandra babu
circular economy parks
recycle
సర్క్యులర్ ఎకానమీపై సీఎం చంద్రబాబు సమీక్ష
మెటీరియల్ రీసైక్లింగ్‌కి అసోసియేషన్ ఆఫ్ ఇండియా
Scroll for the next article