News21st May 10:22 AMSunil Byrisetty1 min read

జిల్లాల పునర్విభజనపై కీలక ఆదేశాలు

ఏపీ కేబినెట్లో జిల్లాల పునర్విభజన అంశంపై చర్చ జరిగింది. మంత్రులతో సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు జిల్లాల పునర్విభజన హామీలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అందులో కూటమి నేతలు, వివిధ సంఘ

జిల్లాల పునర్విభజనపై కీలక ఆదేశాలు
ఏపీ కేబినెట్లో జిల్లాల పునర్విభజన అంశంపై చర్చ జరిగింది. మంత్రులతో సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు జిల్లాల పునర్విభజన హామీలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అందులో కూటమి నేతలు, వివిధ సంఘాలను భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు వివిధ సంఘాల వారిని భాగస్వాములను చేసి నివేదిక రూపొందించాలని ఆయన తెలిపారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం ముంపు మండలాలు, ప్రత్యేక జిల్లాల ఏర్పాటు వంటి హామీలను అమలు చేసే అంశంపై కూలంకషంగా అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు.
Andhra Pradesh
chandrababu naidu
ap districts reorganization
New District With Markapuram
ఏపీ కేబినెట్లో జిల్లాల పునర్విభజన
మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా
Scroll for the next article