News2nd Jun 04:27 PMSunil Byrisetty1 min read

సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం

‘పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహారం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద’ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన

సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం
‘పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహారం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద’ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 12 నుంచి రాష్ట్రంలోని 41వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్ కు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో.. ఆయన చేతుల మీదుగానే పాఠశాలు, సంక్షేమ హాస్టల్స్ కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. ఇంటింటికీ రేషన్ పేరిట వైసీపీ ప్రభుత్వం రూ.1650 కోట్లతో 9360 ఎం.డి.యూ. వాహనాలు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 4వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సంబంధించిన పోస్టర్ ను మనోహర్ విడుదల చేశారు.
Andhra Pradesh news
Ap government schools
Afternoon Lunch
Fine Rice For Mid Day Meals In Schools
Minister Nadendla Manohar
పాఠశాల విద్యార్థులకు బియ్యంతో మధ్యాహ్న భోజనం
Scroll for the next article