News30th Jul 11:32 AMSunil Byrisetty1 min read

ఉచిత గ్యాస్ కోసం క్యాష్ విడుదల

దీపం-2 పథకం కింద కూటమి ప్రభుత్వం ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పథకానికి సంబంధించి సబ్సిడీ విడుదలపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమైంది

ఉచిత గ్యాస్ కోసం క్యాష్ విడుదల
దీపం-2 పథకం కింద కూటమి ప్రభుత్వం ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పథకానికి సంబంధించి సబ్సిడీ విడుదలపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు రూ. 139.53 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులతో ఆగస్టు నుంచి అక్టోబర్ త్రైమాసికానికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయనున్నారు. నిర్దేశిత సమయంలో సబ్సిడీ సొమ్మును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా పౌరసరఫరాల శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది.
Andhra Pradesh
Deepam 2 Scheme
Free LPG Cylinders
LPG Subsidy
Chandrababu Naidu
AP Government
Civil Supplies Department
పౌరసరఫరాల శాఖ
డీబీటీ
సంక్షేమ పథకాలు
లబ్ధిదారులు
గ్యాస్ సిలిండర్
Scroll for the next article