Health8th Aug 04:04 PMSunil Byrisetty1 min read
ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లింపులు!
ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లిస్తోంది. తాజాగా రూ.162.72 కోట్ల చెల్లింపులు జరిపింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 721 ఆసుపత్రులకు నిధులు విడుదల చేసింది. గత నాలుగు
ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లిస్తోంది. తాజాగా రూ.162.72 కోట్ల చెల్లింపులు జరిపింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 721 ఆసుపత్రులకు నిధులు విడుదల చేసింది. గత నాలుగు నెలల్లో ఆసుపత్రులకు మొత్తం రూ.1,504.88 కోట్ల చెల్లింపులు జరిపింది. బిల్ డిస్కౌంటింగ్ సిస్టం ద్వారా ఇప్పటివరకు రూ.1,108.48 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం ద్వారా ఆసుపత్రుల ఖాతాలకు అదనంగా రూ.396.40 కోట్ల జమ చేసింది. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి బకాయిల చెల్లింపులు జరిగినట్లయింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్-ఆశా మధ్య ఒప్పందంతో చెల్లింపులు జరిపింది.