News22nd Jan 03:21 PMSunil Byrisetty1 min read

ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారి అకౌంట్లోకి నగదు!

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న పరిశ్రమల ప్రోత్సాహక నిధులను విడుదల చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ నిర్

ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారి అకౌంట్లోకి నగదు!
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్‌లో ఉన్న పరిశ్రమల ప్రోత్సాహక నిధులను విడుదల చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పారిశ్రామిక రంగంలో వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది. తాజాగా ప్రభుత్వం రూ 60.21 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తంతో 3,122 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందారు.
Andhra Pradesh Government
SC Entrepreneurs
ST Entrepreneurs
Industrial Incentives
MSMEs
ఆర్థిక సహాయం
నగదు బదిలీ
ఏపీ పరిశ్రమల
Scroll for the next article