News1st Jan 04:08 PMSunil Byrisetty1 min read
5 రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగింపు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు నూతన సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. మి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు నూతన సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు మంత్రి చెప్పారు. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు దానిని సుమోటోగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలన్నారు.