News20th Apr 06:21 PMSunil Byrisetty1 min read
క్రైస్తవుల అభివృద్ధికి రూ,150 కోట్లు
ఈస్టర్ సందర్బంగా గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా క్రిస్టియన్ల అభివృద్ధి, సంక్షేమానికి రూ.150 కో
ఈస్టర్ సందర్బంగా గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు.
మునుపెన్నడూ లేని విధంగా క్రిస్టియన్ల అభివృద్ధి, సంక్షేమానికి రూ.150 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇదన్నారు.
క్రైస్తవుల జెరూసలెము యాత్రకు, విదేశీ విద్యను అభ్యసించటానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించిందని తెలిపారు.
నూజివీడులోని సిలువ గట్టుకు ఇరువైపులా వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని, రానున్న సిలువ గట్టు తిరునాల్లకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలు, ఉద్యోగుల సౌకర్యార్థం ఈఎస్ఐ హాస్పటల్ సెంటర్ ఏర్పాటు చేస్తునట్లు మంత్రి అన్నారు.
క్రీస్తు ఆశీస్సులతో పాడి పంటలు బాగా పండి రాష్ట్ర ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలకు అంతా మేలు జరుగుతుందన్నారు.