News21st Jul 05:16 PMSunil Byrisetty1 min read
ఇక ఆ రికార్డులు డిజిటలైజేషన్!
ఏపీ ప్రభుత్వం పాలనలో మరో సంస్కరణ అమలు చేస్తోంది. ఉద్యోగుల సర్వీస్ రికార్డులను డిజిటలైజేషన్ చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు భౌతికంగా ఉన్న రికార్డుల వ్యవస్థను ఇకపై రద్దు చేయనున్న
ఏపీ ప్రభుత్వం పాలనలో మరో సంస్కరణ అమలు చేస్తోంది. ఉద్యోగుల సర్వీస్ రికార్డులను డిజిటలైజేషన్ చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు భౌతికంగా ఉన్న రికార్డుల వ్యవస్థను ఇకపై రద్దు చేయనున్నారు. గతంలోనే ఇ-ఎస్ ఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ అన్ని శాఖల్లో పూర్తిగా అమలు కాలేదు. అప్పటివరకు నమోదైన వివరాలను భద్రపరిచి, వాటినే ఆధారంగా తీసుకుని ఇప్పుడు ఇ -ఎస్ ఆర్ 2.0ను ఆధునికంగా అభివృద్ధి చేశారు. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా పెన్షన్ ప్రతిపాదనలను పూర్తిగా ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చేస్తోంది. తాజా నిర్ణయంవల్ల ఉద్యోగి సేవా వివరాల నుంచి పెన్షన్ మంజూరు వరకు మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా సాగనుంది. ఉద్యోగుల పోస్టులు, సేవా వివరాలు, పదోన్నతులు, బదిలీలు, వేతన మార్పులన్నీ ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులో ఉంటుంది.