News11th Jun 02:50 PMSunil Byrisetty1 min read
వాటర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు..
బెరం పార్కు వద్ద కృష్ణమ్మ తీరం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ నేతృత్వంలో నిర్వహించిన వాటర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు యోగా ప్రియులు వి
బెరం పార్కు వద్ద కృష్ణమ్మ తీరం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ నేతృత్వంలో నిర్వహించిన వాటర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు యోగా ప్రియులు విశేషంగా తరలిరావడంతో పులకించింది. బెరం పార్కుకు చేరుకున్న పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ-పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రలకు యోగా ప్రియులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన యోగా ఔత్సాహికులు పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 201 వాటర్ క్రాఫ్టులతో పాటు నదీ తీర ప్రాంతంలో 2000 మంది యోగాసనాలు ఆచరించడంతో కృష్ణమ్మ ఒడి పులకించింది. ప్రపంచ రికార్డు సాధించాలన్న జిల్లా యంత్రాంగం ఆశయం నెరవేరింది. యోగాసనాలను పరిశీలించిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (డబ్ల్యూఆర్‌యూ) న్యాయనిర్ణేత షరీఫ్ హానిఫ్.. ప్రపంచ రికార్డు సాధించినట్లు ప్రకటించారు.